కేంద్రం ఆఖరి బడ్జెట్ వరకు ఎదురుచూశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారని భావించాం..మన సహనం పూర్తిగా నశించిపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ మిషన్ 2019పై చంద్రబాబు ఇవాళ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  

విశాల దృక్పథం గురించి మోడీ మాట్లాడటం హాస్యాస్పదం, ఏపీపై కక్ష సాధించడం విశాల దృక్పథమా, ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు విశాల దృక్పథమా అని   చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీయేతర పార్టీలే లక్ష్యంగా వేధింపులని ఎద్దేవా చేశారు. ఈ రోజు శాంతియుతంగా నిరసనలు తెలిపాలని, అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.