నేరస్థుడికి కొందరు సినీ హీరోలు సరెండర్ అవుతున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న వైఎస్ జగన్‌తో హీరో నాగార్జున సమావేశమవ్వడంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా టీడీపీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆక్ష్న మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. కృష్ణాజిల్లా నుంచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెడుతున్నట్లు స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాలకు తాను రాజుగా ఉంటూ..  జగన్‌ను ఏపీకి సామంతరాజుని చేయాలని కేసీఆర్ యత్నిస్తున్నారు చంద్రబాబు ఆరోపించారు. ఆర్ధికలోటులో నాలుగో వంతు కూడా ఇంత వరకు చెల్లించలేదని సీఎం ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని కేసీఆర్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే తన ఆటలు సాగవని కేసీఆర్‌.. జగన్‌కు మద్ధతునిస్తున్నరాని ధ్వజమెత్తారు.

ఏపీకి ద్రోహం చేసి నేటికి సరిగ్గా ఐదేళ్లని , నమ్మక ద్రోహానికి 5 వార్షిక నిరసనలు జరపాలన్నారు.  ప్రత్యేకహోదా సహా మిగిలిని 5 హామీలను గాలికొదిలేశారని చంద్రబాబు మండిపడ్డారు.

కేంద్రం పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదని.. ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. బీజేపీ చేసిన నమ్మక ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.