ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారాలోకేశ్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ట్వీట్టర్ ద్వారా స్పందించిన ఆయన ‘‘ నారా లోకేశ్‌కు నా ఆశీస్సులు, పూర్తి నిజాయితీ, అంకిత భావంతో రాష్ట్ర ప్రజలకు తన సేవలను లోకేశ్ కొనసాగిస్తారని ఆశిస్తున్నానంటూ సీఎం ట్వీట్ చేశారు.

ప్రస్తుతం లోకేశ్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గోంటున్నారు. అంతకు ముందు చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోటని, ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసిన జిల్లా ప్రజలను ఆదుకోవడం తన బాధ్యతని ఆయన వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. దీనిలో భాగంగానే కృష్ణాజలాలను చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చానని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని జిల్లాకు ఇంకా చాలా చేస్తామని హామీ ఇచ్చారు.