అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదవుల పందేరానికి తెరలేపారు. పలు బహిరంగ సభలలో అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు హామీ నిలబెట్టుకున్నారు. 

రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలతోపాటు పలు విభాగాల కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. కీలకమైన మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నెల్లూరుకు చెందిన మాజీ మేయర్‌ తాళ్లపాక అనూరాధను, ఈబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజును, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ చైర్మన్‌గా మన్నె రవీంద్రను, ఏపీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ చైర్మన్‌గా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ యువనేత కరణం వెంకటేశ్‌ను నియమించారు. 

కరణం వెంకటేశ్ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం తనయుడు. వీరితోపాటు ఏపీ ఎన్ఎండీసీ చైర్మన్ గా నెల్లూరుకు చెందిన  డా.జెడ్. శివప్రసాద్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్వోగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన  జి.శ్రీదేవి చౌదరిని నియమించారు. 

ఇకపోతే అనంతపురం, కడప, కర్నూలు ఆర్టీసీ రీజినల్ చైర్మన్ గా మైదుకూరుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి, ఏలూరు అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉప్పల జగదీష్ బాబు, పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా కుప్పంకు చెందిన ఎం సుబ్రమణ్యం రెడ్డి, ఏపీ తూర్పుకాపు, గాజులకాపు సహకార ఆర్థిక కకార్పొరేషన్ చైర్మన్ గా శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన కోళ్ల అప్పలనాయుడు, ఏపీకాపుల వెలమ చైర్మన్ గా విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన గండి బాబ్జీలను నియమించారు. 

ఇకపోతే ఏపీ గవర సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా పెందుర్తికి చెందిన పీలా శ్రీనివాసరావు, ఏపీ వీవర్స్ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా తూర్పుగోదావరి జిల్లా తణుకు చెందిన వావిలాల సరళా దేవనిని ఎంపిక చేశారు. 

అటు ఏపీ ఫిషర్ మెన్ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైనరచైర్మన్ గా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంకు చెందిన నాగిడి నాగేశ్వరరావు, ఏపీ యాదవ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా ఒంగోలుకు చెందిన నూకసాని బాలాజీ, ఏపీ వన్యకుల క్షత్రియ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా  తిరుపతికి చెందిన డా.సి.సుబ్రమణ్యం, ఏపీ కురుబ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా పెనుకొండకు చెందిన ఎస్.సవిత, ఏపీ భట్రాజ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా పెనుమలూరుకు చెందిన పి.వేణుగోపాలరాజులను నియమించారు. 

ఏపీ గాండ్ల  చైర్మన్ గా సింగనమలకుకు చెందిన చిత్రచేదు విశాలాక్షి, ఏపీ గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మ న్ గా పాడేరుకు చెందిన ఎంవీవీ ప్రసాద్, ఏపీ రాష్ట్ర టైలర్స్ సహకార సొసైటీల ఫెడరేషన్ చైర్మన్ గా తాడేపల్లి గూడెంకు చెందదిన ఆకాశపు వీవీఎల్ ఎన్ స్వామిలను నియమిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు.