అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిస్తున్నారు. శుక్రవారం వృద్ధులకు పెన్షన్ ను రూ.2000కు పెంచుతున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. ఆ ప్రకటన వెలువడి 24 గంటలు వెలువడక ముందే మరోక కీలక ప్రకటన చేశారు. 

రెండు చేతులు లేని దివ్యాంగులకు రూ.10వేలు పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రెండు చేతులు లేని వారు కనీసం తినలేని పరిస్థితి ఉందని అలాగే వారు మరోకరిపై వారు ఆధారపడాల్సిన పరిస్థితినెలకొందన్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో వారిని మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు నెలకు రూ.10వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్ జనవరి నెల నుంచే అమలు చేస్తానని ప్రకటించారు. అలాగే సంక్రాంతి పర్వదినం సందర్భంగా మరొక వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.