విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వేదికగా రెండు రోజులుగా జరుగుతునన గ్లోబల్ స్టార్ ఎయిర్ షో విన్యాసాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆనంద సూచీలో అగ్రస్థానంలో నిలిపామన్నారు.

ఇటీవలే సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్ 1 బోట్ రేసింగ్  విజయవాడలో నిర్వహించామని వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. బోట్ రేసింగ్ పోటీలకు ఇంతటి అనువైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని అభిప్రాయపడ్డారు.

అమరావతిలో ప్రజలకు నిత్యం వినోదం, ఆహ్లాదం పంచే కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. విమానాల విన్యాసాలు చూస్తుంటే తనకూ పైలట్ కావాలన్న కోరిక కలుగుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజ్‌ని ఇన్నాళ్లు సక్రమంగా ఉపయోగించలేదని... ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు.