ఏపీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 

ఏపీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గురువారం పార్టీ నేతలో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్, తలసాని ఏపీ పర్యటన తదితర విషయాల గురించి చంద్రబాబు ప్రస్తావించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా..? అని చంద్రబాబు తలసానిని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనరాదని ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఒకవేళ ఎవరైనా పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి..స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణలో 26కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని.. అదే టీఆర్ఎస్ నేతలు ఏపీకి వచ్చి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి గొంగళి పురుగు జగన్ ని కేసీఆర్ కౌగిలించుకున్నారన్నారు.