ప్రముఖ టాలీవుడ్ దర్శక, నిర్మాత బాపినీడు మంగళవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. ఉత్తమ అభిరుచితో కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించి, నిర్మాతగా వ్యవహరించిన అతి కొద్దిమంది నిర్మాతల్లో బాపినీడు ఒకరని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా విజయ బాపినీడు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయబాపినీడు... ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన చిరంజీవీ, శోభనబాబు లాంటి హీరోలతో పలు సినిమాలు తెరకెక్కించారు.