మాదాల రంగారావు మృతికి చంద్రబాబు సంతాపం

ap cm chandrababu condolence to madala rangarao
Highlights

అస్తమించిన ఎర్రసూర్యుడు

అభ్యుదయ సినీ నటుడు, ప్రజానాట్యమండలి కళాకారుడు మాదాల రంగారావు మృతికి ఎపి సిఎం చంద్రబాబు ప్రగాడ సంతాపం తెలిపారు. అవినీతి అక్రమాలపై, సామాజిక దున్యాయాలపై మాదాల సినీ మాధ్యమం ద్వారా పోరాడి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. అప్పట్లో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నప్పుడు మాదాల అభ్యుదయ చిత్రాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాయని తెలిపారు. రాజకీయ, సామాజిక రంగాల్లో చీకటి కోణాలను తన చిత్రాలలో ఎండగట్టారని అన్నారు. మాదాల రంగారావు కుటుంబసభ్యులకు సిఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు.

స్వగృహానికి మాదాల భౌతికకాయం :

అనారోగ్యంతో కన్నుమూసిన విప్లవ నటుడు, నిర్మాత, రెడ్ స్టార్ మాదాల భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్ లోని స్వగృహానికి తరలించారు. మాదాల పార్దీవ దేహానికి సినీ నటుడు హరికృష్ణ, సిపిఐ నేత నారాయణ, వందేమాతరం శ్రీనివాస్, బెనర్జీ, మద్దినేని రమేష్ తదితరులు నివాళులు అర్పించారు. తీవ్ర అవస్వస్థత, శ్వాసకోస సమస్యతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన మాదాల రంగారావు ఆదివారం తెల్లవారుజామున 4..40 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.

 

 ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహానికి తరలించారు. మాదాల పార్థివదేహానికి నటుడు హరికృష్ణ, సీపీఐ నేత నారాయణ, వందేమాతరం శ్రీనివాస్‌, బెనర్జీ, మద్దినేని రమేష్‌ నివాళులర్పించారు. తీవ్ర అస్వస్థత, శ్వాసకోస సమస్యతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన మాదాల రంగారావు ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విప్లవ సినిమాల నిర్మాత మాదాల రంగారావు 71 సినిమాల్లో నటించారు.మాదాలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో ఒకరు మాదాల రవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మాదాల రంగారావు వారసుడిగా కొనసాగుతున్నారు.

ఎర్రపూలు, ఎర్రసూర్యుడు, ఎర్రమట్టి, ప్రజాశక్తి, ఎర్రపావురాలు, నవోదయం, మహాప్రస్థానం, కురుక్షేత్రం, వీరభద్రుడు, స్వరాజ్యం, ఎర్రమల్లెలు సినిమాల్లో నటించారు. ప్రజానాట్యమండలిలో సభ్యుడిగా కొనసాగారు.

loader