చంద్రబాబును 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరిన సిఐడి...
టిడిపి ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి తాజాగా కోర్టులో ప్రవేశపెట్టింది.

విజయవాడ : మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు ఏసిబి కోర్టులో హాజరుపర్చారు. ఇప్పటికే కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1) గా చేర్చింది సిఐడి. ఈ క్రమంలో ఆయనను విచారించేందుకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలని న్యాయమూర్తిని సిఐడి కోరింది.
సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరుమీద విజయవాడ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరిట రూ.371 కోట్ల కుంభకోణం జరిగిందన ఆ రిపోర్ట్ లో సిఐడి పేర్కొంది. అంతేకాదు 2021 లో నమోదుచేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును ప్రస్తావించని సిఐడి తాజాగా ఏ1 గా చేర్చింది. అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఆధారంగా చంద్రబాబును ఏ1 ప్రధాన నిందితుడిగా మార్చినట్టు తెలుస్తుంది.
Read More తీవ్ర ఉత్కంఠ... ఏసిబి కోర్టుకు చంద్రబాబు... రిమాండా, బెయిలా? (వీడియో)
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన కుట్రధారుగా సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. 9 డిసెంబర్ 2021 కంటే ముందే నేరం జరిగిందని సిఐడి పేర్కొంది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని... చంద్రబాబుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములుగా వున్నారని సిఐడి ఆరోపిస్తోంది.