అమరావతి అసైన్డ్ భూముల కేసు.. మాజీ మంత్రి నారాయణ కంపెనీలో ముగిసిన ఏపీ సీబీఐ సోదాలు..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుటుంబానికి చెందిన న్‌ఎస్‌పీఆర్‌ఏ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏపీ సీఐడీ సోదాలు ముగిశాయి.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుటుంబానికి చెందిన న్‌ఎస్‌పీఆర్‌ఏ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏపీ సీఐడీ సోదాలు ముగిశాయి. మంగళవారం రాత్రి వరకు సోదాలు కొనసాగించిన అధికారులు.. బుధవారం ఉదయం కూడా సోదాలు చేపట్టారు. అమరావతి రాజధాని ప్రాంతంలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లుగా నారాయణపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సోదాల్లో అక్రమ, బినామీ భూముల కొనుగోలుకు సంబంధించిన నిధుల మళ్లింపుపై కొంత సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సోదాల్లో 10 మంది ఏపీ సీఐడీ అధికారులు పాల్గొన్నారు.
అమరావతి ప్రాంతంలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై 2020లో నారాయణపై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సీఐడీ వర్గాల ప్రకారం.. రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి లాక్కోవాలనే ఉద్దేశంతో అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ, మరికొందరు మంత్రులు, వారి బినామీలు.. ఆ భూములకు సంబంధించి ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ పథకం కింద ప్రభుత్వం తీసుకుంటుందనే భయం నెలకొలిపి కాజేశారు. ఆ తర్వాత వారి నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. అనంతరం మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములకు ల్యాండ్‌పూలింగ్ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు 2016లో జీఓ 41 జారీ చేయాలని మంత్రులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు.