ఇన్నర్ రింగ్ రోడ్ కేసు : నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు, అక్టోబర్ 4న విచారణకు రావాలని ఆదేశం (వీడియో)

అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ap cid issued notice to tdp leader nara lokesh for amaravati inner ring road scam ksp

అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీకి వెళ్లిన సీఐడీ బృందం.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో వున్న లోకేష్‌కు నోటీసులు అందజేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 41ఏ కింద లోకేష్‌కు ఈ నోటీసులు అందజేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా వున్నారు నారా లోకేష్. 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా గత ఏడాది ఏప్రిల్ లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా సీఐడీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏ-1గా, నారాయణను ఏ-2గా పేర్కొన్న సీఐడీ, నారా లోకేష్ ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది.

Also Read: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు నారా లోకేష్

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో చేసిన మార్పుల ద్వారా లోకేష్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని సీఐడీ ఆరోపించింది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ, అలైన్ మెంట్ ప్రక్రియ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు భూసేకరణకు సంబంధించిన అవకతవకలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్ లను నిందితులుగా చేర్చింది ఏపీ సీఐడీ. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios