Asianet News TeluguAsianet News Telugu

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు నారా లోకేష్

Amaravati: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఏపీ-సీఐడీ 14వ నిందితుడిగా చేర్చింది. అయితే, రాజకీయ పగ, ప్రతీకారమే అరెస్ట్‌లో ప్రధానాంశమని టీడీపీ నేతలు పేర్కొంటూ వైఎస్ ఆర్సీసీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ముంద‌స్తు బెయిల్ కోసం లోకేష్ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. 
 

Amaravati Inner Ring Road case: Nara Lokesh moves AP HIGH Court seeking anticipatory bail RMA
Author
First Published Sep 27, 2023, 7:50 PM IST

Nara Lokesh moves AP High Court: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఏపీ-సీఐడీ 14వ నిందితుడిగా చేర్చింది. అయితే, రాజకీయ పగ, ప్రతీకారమే అరెస్ట్‌లో ప్రధానాంశమని టీడీపీ నేతలు పేర్కొంటూ వైఎస్ ఆర్సీసీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ముంద‌స్తు బెయిల్ కోసం లోకేష్ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

వివ‌రాల్లోకెళ్తే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నందున ఆయన తరఫున‌ న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ14గా ఏపీ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రాజధానిలోని అన్ని రహదారులను కలుపుతూ అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ ఆర్ ) ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం చేప‌ట్టింది.

అయితే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా గత ఏడాది ఏప్రిల్ లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా సీఐడీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏ-1గా, నారాయణను ఏ-2గా పేర్కొన్న సీఐడీ, నారా లోకేష్ ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో చేసిన మార్పుల ద్వారా లోకేష్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని సీఐడీ ఆరోపించింది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ, అలైన్ మెంట్ ప్రక్రియ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు భూసేకరణకు సంబంధించిన అవకతవకలకు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్ లను నిందితులుగా చేర్చింది ఏపీ సీఐడీ. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు.

Follow Us:
Download App:
  • android
  • ios