Asianet News TeluguAsianet News Telugu

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం: హెరిటేజ్ ఫుడ్స్ పై కేసు నమోదు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
 

AP CID  Files Case  Against  Heritage Foods private Limited  in Amaravathi inner ring road lns
Author
First Published Sep 26, 2023, 7:09 PM IST

అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై  ఏపీ సీఐడీ అధికారులు  కేసు నమోదు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ 14గా ఏపీ సీఐడీ చేర్చింది. లోకేష్ పై కోర్టులో దాఖలు చేసిన మెమోలో ఏపీ సీఐడీ అధికారులు కీలక విషయాలను ప్రస్తావించారు.  ఈ కేసులో  ఏ1 గా ఉన్న చంద్రబాబును లోకేష్ ప్రభావితం చేశారని సీఐడీ ఆరోపిస్తుంది. అమరావతి రాజధాని అలైన్ మెంట్ ను  మార్పులు చేసి తమ భూముల విలువ పెరిగేలా చేశారని సీఐడీ ఆరోపించిన విషయం తెలిసిందే. .

రాజధాని ప్రకటనకు ముందే వేరే వ్యక్తులతో తుళ్లూరు , మండలం ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేశారని సీఐడీ అభియోగాలు మోపింది. రాజధాని ప్రకటన తర్వాత ఈ భూములను  హెరిటేజ్ సంస్థకు మార్పిడి చేసుకున్నారని సీఐడీ ఆరోపించింది.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో  లింగమనేని రమేష్ కు కూడ లబ్ది కల్గించేలా వ్యవహరించారని  ఆ కథనం తెలిపింది.

అమరావతి మాస్టర్ ప్లాన్,  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుల విషయంలో తమ వారికి ప్రయోజనం పొందేలా  వ్యవహరించడంలో  లోకేష్ కీలకంగా  వ్యవహరించారని సీఐడీ ఆరోపించింది. హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో  చంద్రబాబు భార్య,  లోకేష్ భార్య  బ్రహ్మణి కీలక పదవుల్లో ఉన్నారని సీఐడీ పేర్కొంది. చంద్రబాబు కుటుంబానికి  హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో 50 శాతం వాటా ఉందని సీఐడీ అధికారులు ఆ మెమోలో పేర్కొన్నారని ఆ కథనం వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios