సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పవు.. వారి ఆస్తులు అటాచ్ చేస్తామంటూ ఏపీ సీఐడీ హెచ్చరిక..
సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కోరారు. ఇందుకు సంబంధించి మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నామని చెప్పారు.

సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కోరారు. ఇందుకు సంబంధించి మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారని చెప్పారు. సీఎం జగన్ కుటుంబంపై అనుచిత పోస్టులు పెట్టేవారిని గుర్తించామని చెప్పారు. వారిపై నిఘా పెట్టామని, త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలపై ఉన్న అనుచిత పోస్టులను తొలగించామని చెప్పారు. ఫేక్ అకౌంట్స్‌ను నడిపేవారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వ్యక్తులను ప్రోత్సహించేవారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
టీడీపీ కార్తీక్ రెడ్డి, సమర సింహా రెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు లాంటి అకౌంట్ల నుంచి అసభ్య కరమైన పోస్టులు పెట్టే వారి మీద కఠిన చర్యలతో పాటూ వారి ఆస్తులు జప్తు చేయడానికి కూడా సీఐడీ వెనకాడదని చెప్పారు. సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పారు.
ఎక్కడ నుంచి పోస్టులు పెట్టినా కనిపెట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫేక్ అకౌంట్స్‌తో పోస్టులు పెడితే గుర్తించలేమనుకుంటే పొరపాటేనని తెలిపారు. ఫేక్ అకౌంట్స్‌ను పట్టుకునేందుకు అవసరమైన సాంకేతికత ఉందని.. వాటిపై యుద్దం ప్రకటిస్తుందని చెప్పారు. ఎవరిపైనైనా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులపైనా కూడా అనుచిత పోస్టులు పెడుతున్నారని చెప్పారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టి సారించామని తెలిపారు. అనుచిత పోస్టులతో అమూల్యమైన భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సీఐడీ చీఫ్ సంజయ్ కోరారు.