చిట్‌ఫండ్ వ్యాపారం విషయమై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
రాజమండ్రి: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అధికారులు ఆదివారంనాడు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి చిట్ ఫండ్ వ్యాపారాలున్నాయి.ఈ విషయమై సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలోని తమ కార్యాలయంలో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు వాసులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు. ఆదిరెడ్డి అప్పారావు కుుటంబం గతంలో వైసీపీలో ఉండేది. ఆ తర్వాత ఈ కుటుంబం టీడీపీలో చేరింది. రాజమండ్రిలో ఆదిరెడ్డి భవానీ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించింది.
Add Asianetnews Telugu as a Preferred Source

