అమరావతి: పెట్రోల్  లీటర్ ధర వంద  అవుతోందేమో... డాలర్ తో రూపాయి మారకం విలువ కూడ వందకు చేరుకొంటుందేమో..  ఆయన చంద్రబాబునాయుడు అనుమానం వ్యక్తం చేశారు.  ఎన్డీఏ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. 

సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.నోట్ల రద్దుపై  ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. నోట్ల రద్దు సమయంలో  తాను కొన్ని సూచనలు చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. బ్యాంకుల్లో కుంభకోణాలు చోటు చేసుకొన్నాయని చెప్పారు.ఆర్థికాన్ని కుప్పకూల్చడం  గొప్పతనమా... అసమర్థతగా ఆయన చెప్పారు. ఎకానమీ ఎందుకు దెబ్బతిందని ఆయన ప్రశ్నించారు.

ఏటీఎంలలో డబ్బులు క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఎకానమీ గ్రోత్ తగ్గిపోయిందన్నారు. కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉంటే ఇంకా ఇంకా ఎకానమీ గ్రోత్ ఇంకా పెరిగేదన్నారు. 

స్విస్ బ్యాంకు అకౌంట్ల నుండి డబ్బులను తెస్తామని చెప్పి ఏం చేశారో చెప్పాలన్నారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే అవినీతిపరులతో అంటకాగడమేనా అని ఆయన ప్రశ్నించారు. 

డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని తాను  కేంద్రానికి రికమెండేషన్ ఇవ్వాలని చెప్పారు. అంతేకాదు రూ. 500 , రూ 2 వేల నోట్లను రద్దు చేయాలని  తాను సిఫారసు చేసినట్టు బాబు చెప్పారు.డిజిటల్ కరెన్సీ ద్వారా అవినీతిని అరికట్టే అవకాశం ఉందన్నారు. 

ఈ వార్త చదవండి

2019 మే నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు