ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ద్వివేది నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం ఆదివారం ఉదయం గవర్నర్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను వారు నరసింహన్‌కు అందజేశారు.