Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ.. మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు..!

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఈ నెల 20న భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరగనుంది.

AP Cabinet To Meet on 20th september and assembly session likely from next day ksm
Author
First Published Sep 13, 2023, 12:17 PM IST | Last Updated Sep 13, 2023, 12:17 PM IST

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఈ నెల 20న భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి మండలి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా మంత్రివర్గం చర్చించనుంది. అలాగే అసెంబ్లీలో ప్రవేశ పెట్టే పలు బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 

ఇక, ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని.. అవసరమైతే మరో రెండు రోజులు సమావేశాలు పొడిగించేచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సమావేశాల్లోనే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా కొన్ని కొత్త ఆర్డినెన్స్‌లు, కొత్త బిల్లులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టుగా సమాచారం. అలాగే అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై కేసులను అంశాన్ని ప్రస్తావించేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. 

Also Read: హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా.. సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఊరట..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios