Asianet News TeluguAsianet News Telugu

ఏపీ కేబినెట్ విస్తరణ: రేపు రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణరావుల రాజీనామాతో ఖాళీ అయిన మంత్రి పదవులను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు‌తో భర్తీ చేయనున్నారు. 

ap cabinet reshuffle: ministers oath ceremony will held on wednesday
Author
Amaravathi, First Published Jul 21, 2020, 8:41 PM IST

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణరావుల రాజీనామాతో ఖాళీ అయిన మంత్రి పదవులను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు‌తో భర్తీ చేయనున్నారు.

వీరిద్దరితో బుధవారం మధ్యాహ్నం 1 గంటకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరోవైపు మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు.

ప్రమాణ స్వీకారానికి ముందు జగన్ ఓ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. వాస్తవానికి జోగి రమేశ్, పొన్నాడ సతీశ్‌లకు అవకాశం ఇస్తారని భావించినప్పటికీ.. సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు‌లను తీసుకోవాలని ముఖ్యమంత్రి భావించారు.

కొత్త మంత్రుల్లో వేణుకు ఆర్ అండ్ బీ, అప్పలరాజుకు మత్స్య శాఖను అప్పగిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే శాఖల మార్పిడి భారీగా ఉంటుందని.. కీలకంగా వున్న మంత్రుల శాఖలు మారతాయని అంటున్నారు. కాగా, నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా కడప జిల్లాకు చెందిన జకియా ఖానుం, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు పేర్లను జగన్ గవర్నర్‌కు పంపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios