ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ: కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినటె్ భేటీ ప్రారంభమైంది.ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
 

AP Cabinet meeting Begins Today At Amaravathi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి YS Jagan అధ్యక్షతన గురువారం AP Cabinet Meeting ప్రారంభమైంది. కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో Asani Cyclone పై చర్చించనున్నారు. 

ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ నిర్ణయాలు, ఈ నెలలో చెల్లించే రైతు భరోసాకు, పలు పరిశ్రమలకు సంబంధించి భూముల కేటాయింపులకు కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది.విశాఖపట్టణంలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపులపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.పెట్టుబడులు, పరిశ్రమలకు భూ కేటాయింపులపై చర్చించనున్నారు. దేవాదాయ శాఖ భూములు ఆక్రమణ  కాకుండా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు.దిశ చట్టంలో రెండు మార్పులను కోరుతూ కేంద్రం రాష్ట్రానికి పంపింది. ఈ విషయమై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఇవాళ జరిగిన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు.

ఇవాళ జరిగిన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.అసాని తుఫాన్ ప్రభావంపై కేబినెట్ సమావేశంలో చర్చించారు.

విశాఖపట్టణం జిల్లాలో తమకు ప్రత్యామ్నాయ ప్రాంతంలో భూమిని కేటాయించాలని అదానీ గ్రూప్ కోరినట్టుగా సమాచారం.ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిసింది.ఈ విషయమై కేబినెట్ లో చర్చించనున్నారు.

నెల్లూరు జిల్లాలో బయోఇథనాల్ సంస్థ 100 ఎకరాల్లో ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ విషయమై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. లాజిస్టిక్, ఎక్స్ పోర్టు పాలసీలపై సవరణలను కూడా ప్రభుత్వం చేయనుంది. ఈ సవరణలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పెట్టుబడులు పెట్టే వారికి మరింత వెసులు బాటు కల్పించేందుకు వీలుగా సవరణలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది.

ఈ నెల 22 నుండి 26 వరకు థావోస్ లో జరిగే పెట్టుబడుల సదస్సుకు సీఎం జగన్ నేతృత్వంలో మంత్రుల బృందం హాజరు కానుంది.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం నుండి  ఎలాంటి ప్రోత్సాహకాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios