అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు ఉదయం ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం సాగుతోంది. పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అంశంపైప్రధానంగా చర్చిస్తున్నారు.

స్థానిక సంస్థల్లో  59.85 శాతం రిజర్వేషన్లనుకల్పిస్తూ ఇచ్చిన 176 జివోను ఏపీ  హైకోర్టు  ఇటీవలనే కొట్టివేసింది. రిజర్వేషన్ల ప్రక్రియపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ విషయమై కేబినెట్ చర్చిస్తోంది.  హై కోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనుంది సర్కార్. 

దీనికి తోడు ఉగాదికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్చిస్తోంది.  రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పట్టాను పంపినీ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఈ తరుణంలో  ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి  కేబినెట్ చర్చిస్తోంది.  బడ్జెట్ సమావేశాలను కూడ నిర్వహించాలని కూడ ఏపీ సర్కార్ భావిస్తోంది. 

ఎన్‌పీఆర్‌లో మార్పులు కోరుతూ కేబినెట్‌ కూడ తీర్మానం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యల గురించి కేబినెట్ చర్చిస్తోంది.  ఈ నెల 27వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే చాన్స్ ఉంది