Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త వర్సిటీలు, విద్యార్ధులకు లాప్‌టాప్‌లు: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 
 

ap cabinet key decisions ksp
Author
Amaravathi, First Published Jun 30, 2021, 2:19 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 

ఏపీ కేబినెట్ నిర్ణయాలు:

  • మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు ఆమోదం
  • 28 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం ప్రచార కార్యక్రమం 
  • 9-12వ తరగతి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
  • ప్రకాశం జిల్లా పేర్నమెట్టలో ఆంధ్రకేసరి యూనివర్సిటీకి ఆమోదం
  • విజయనగరంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ వర్సిటీకి ఆమోదం
  • మౌలిక సదుపాయాల కల్పనకు రూ..5,990 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం 
  • 2021-24 ఐటీ విధానానికి ఆమోదం
  • ఏపీ భూమి హక్కు చట్ట సవరణకు ఆమోదం
  • రీసర్వేలో పట్టాదారులకు ధృవపత్రాలు జారీ 
  • హంద్రీనివా సుజల స్రవంతి పథకంలో పుట్టపర్తి నియోజకవర్గానికి రూ.864 కోట్లతో నీటి సరఫరాకు కేబినెట్ ఆమోదం
  • విజయవాడ గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్
  • సత్యనారాయణపురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చేందుకు కేబినెట్ అంగీకారం
  • కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ
  • మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి
  • విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం
  • 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం 
  • రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.
     
Follow Us:
Download App:
  • android
  • ios