రేపు ఏపీ కేబినెట్ భేటీ... నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేలా నిర్ణయాలుంటాయట...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి సమావేశం రేపు(మంగళవారం) జరగనుంది. 

AP Cabiinet Meeting to be held in Tomorrow AKP

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగులకు తీపికబురు చెప్పేతా వుంది. రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటుచేసారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీయే ప్రధాన ఎజెండాగా ఈ మంత్రిమండలి సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్... ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సీఎం మంత్రులతో చర్చించనున్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలకు వివరించాలని... ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

మంత్రులతో భేటీ తర్వాత రేపు సాయంత్రం వైసిపి ముఖ్య నాయకులు, సీనియర్లతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న స్పందన గురించి జగన్ తెలుసుకోనున్నారు. అలాగే ఈ సామాజిక యాత్రను సక్సెస్ ఫుల్ ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై నాయకులతో చర్చించనున్నారు వైసిపి అధినేత వైఎస్ జగన్. 

Read More  రాబోయే ఎన్నికల్లో తేల్చుకుందాం..: తనపై తెలంగాణలో జరిగిన దాడిపై అంబటి సీరియస్

ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కేవలం ఓటర్ లిస్ట్ పై అవగాహన కల్పించేందుకు, కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించేందుకు కొత్తగా ఒకరిని నియమించాలని వైసిపి భావిస్తోంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సిపార్సుతో ఈ నియామకం చేపట్టాలని చూస్తోంది. వైసిపి ఎమ్మెల్యేలు లేని నియోకవర్గాల్లో ఇంచార్జ్ ల సిఫార్సుతో ఈ నియామకం చేపట్టాలని నిర్ణయించారు.

నియోజకవర్గ స్థాయిలో కొత్తగా నియమితులైనవారు వైసిపి రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం చేసేలా ఓ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని వైసిపి భావిస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు ఆ నియోజకవర్గ స్థాయిలో నియమితులయ్యేవారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా వ్యవస్థ ఏర్పాటుకు వైసీపీ దృష్టి సారించింది. దీనిపైనా వైసిపి నాయకులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios