రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఉద్యోగస్తులకు చంద్రబాబు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. 

* వేరే చోట నివసించే ప్రభుత్వోద్యోగులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు ఇవ్వాలని నిర్ణయం

* కొత్త పెన్షన్ స్కీమ్ లో మార్పులకు కమిటీ ఏర్పాటు

* ఉద్యోగులకు గ్రాట్యూటీ, కుటుంబం పెన్షన్

* 70 ఏళ్లు దాటిన పెన్షన్ దారులకు 10 శాతం అదనం

* కానిస్టేబుళ్లకు ప్రమోషన్ల పెంపు

* లెక్చరర్స్ కు టైమ్ స్కేల్,  పీఆర్ సీ బకాయిల చెల్లింపు, నగదు రహిత హెల్త్ స్కీమ్

* 8 కోట్ల 2 లక్షల 80 వేల ఉద్యోగులకు వేతనం

* పుల్ టైమ్, డైలీ, కాన్సలిడేటేడ్ పార్ట్ మైట్ ఉద్యోగులపై 2015 నాటి కనీస వేతన స్కీమ్ కు మార్పు

* అర్చకులు, అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల పెంపు

* వీఆర్ఏ, వీఆర్ఓలకు కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  15 వేలు