కడప: జగన్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే బాధ్యత  బీజేపీ ప్రభుత్వం తీసుకొంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  చెప్పారు. శనివారం నాడు ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు. జగన్ కు చెక్ పెట్టే పార్టీ బీజేపీయేనని ఆయన చెప్పారు. 

స్థానిక ఎమ్మెల్యేల చెప్పు చేతుల్లో పోలీసులు, రెవిన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.  ఈ ఎన్నికలను అధికార యంత్రాంగం నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు.అధికార పార్టీకి ఏజంట్లుగా పోలీసులు, రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

కొత్త సినిమా చూపిస్తున్నంటూ కొత్త అస్త్రాన్ని జగన్ ప్రయోగిస్తున్నారని ఆయన విమర్శించారు. అంత పెద్ద మెజార్టీ ఉన్న జగన్ ప్రజా మద్దతు కోల్పోయారా అని అడిగారు. 

అమృత పథకం కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే నేటికీ పనులను  ప్రభుత్వం ప్రారంభించలేదన్నారు.  సంక్షేమ ఫలాల అమలు చేస్తున్నదెవరో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.