Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ: సోము వీర్రాజు వ్యాఖ్యలు

తిరుపతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. తిరుపతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఇప్పటికే పలు విద్యాసంస్థలను ఈ నగరానికి కేటాయించామని, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేశామని గుర్తుచేశారు. 

ap bjp president somu veerraju meet the press in tirupati ksp
Author
Tirupati, First Published Apr 11, 2021, 4:44 PM IST

తిరుపతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. తిరుపతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఇప్పటికే పలు విద్యాసంస్థలను ఈ నగరానికి కేటాయించామని, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేశామని గుర్తుచేశారు.

తిరుపతి అభివృద్ధి బాధ్యతలను నరేంద్రమోడీ ప్రభుత్వమే తీసుకుందని ఆయన చెప్పారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

బీజేపీ- జనసేన పార్టీలు కలిసి భవిష్యత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిపుణులైన వ్యక్తులతో టీటీడీ బోర్డును నింపుతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా తీరుపతిని ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధానిగా చేస్తామని వెల్లడించారు. 

Also Read:అఫీషియల్: సెల్ఫ్ క్వారంటైన్ లోకి పవన్ కళ్యాణ్

మరోవైపు రేపు బీజేపీ-జనసేన సంయుక్తంగా విజయ యాత్రను ప్రారంభించనున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధినేత పవన్ కల్యాణ్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ హాజరు కాబోతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

కానీ, ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరు కావడంపై అనుమానాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios