Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో భారీగా మతమార్పిడులకు వైసిపి నాయకుల కుట్రలు...: విజయవాడ ధర్నాలో సోము వీర్రాజు (వీడియో)

హిందూ ధర్మంపై దాడిని ప్రోత్సహిస్తూ వైసిపి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని... ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బిజెపి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో విజయవాడలో బిజుపి రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు నిరసనకు దిగారు. 

ap bjp president somu veerraju dharna at vijayawada akp
Author
Vijayawada, First Published Jul 28, 2021, 12:59 PM IST

విజయవాడ: ఆనాటి బ్రిటిష్ పాలకులు... నేటి వైసీపీ నాయకులు ఒక్కటేనని ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. అప్పుడు బ్రిటిష్ వారు గోమాతను చులకన చేస్తే, ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కూడా అలాగే చేస్తున్నారని అన్నారు. భారతీయులు పవిత్రంగా భావించే గోమాత పై వైసీపీ నాయకుల ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. 

హిందూ ధర్మంపై దాడిని ప్రోత్సహిస్తూ వైసిపి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని... ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బిజెపి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమంలో ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. 

వీడియో

ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ... ప్రకాశం జిల్లాలో హిందూ ధర్మాన్ని అనుసరించే ఎస్టీ వర్గాలను మతం మారాలని వైసిపి నాయకులు వేధించారని అన్నారు. ఎస్టీలపై దాడులకు పాల్పడిన వైసిపి నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 

read more  టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం... ప్రొద్దుటూరులో ఉద్రిక్తత, సోము వీర్రాజు అరెస్ట్

గోవధకు వత్తాసు పలుకుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయా‌పై దాడులు, దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తే వీర్రాజు ధర్నా చేపట్టారు.  

''సీఎం ఓటు బ్యాంకు రాజకియ్యలు చేస్తున్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక పాలనను బీజేపీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్రంలో వైసీపీని దీటుగా ఎదుర్కొనే పార్టీ బీజేపీ. హిందువుల మనోభావాలకు అద్దం పట్టే పార్టీ బీజేపీ. వైసీపీ నేతలు గోమాత పై చేసిన అనుచిత వ్యాఖ్యలు,ఎస్టీలపై దాడులపై ఈ ప్రభుత్యం వెంటనే చర్యలు చేపట్టాలి. లేకపోతే ప్రజాఉద్యమం తప్పదు'' అని వీర్రాజు హెచ్చరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios