Asianet News TeluguAsianet News Telugu

23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది: చంద్రబాబుపై కన్నా ఫైర్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నప్పుడు ఏమైందన్నారు. అలాగే వైస్రాయ్ హోటల్ లో ఎన్టనీఆర్ కు సపోర్టు చేసిన ఎమ్మెల్యేలను దాచిపెట్టినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని నిలదీశారు. 
 

ap bjp president kannalaxminarayana fires on chandrababu
Author
Guntur, First Published May 1, 2019, 8:51 PM IST

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. 

మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 మంది టీంఎంసీ ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నారని మోదీ చెబితే  ప్రధాని ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నారని మాట్లాడుతున్న చంద్రబాబు గతంలో ఏం చేశారని నిలదీశారు. 

ట్విటర్‌ వేదికగా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నప్పుడు ఏమైందన్నారు. అలాగే వైస్రాయ్ హోటల్ లో ఎన్టనీఆర్ కు సపోర్టు చేసిన ఎమ్మెల్యేలను దాచిపెట్టినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని నిలదీశారు. 

కర్ణాటక ఎలక్షన్‌లో హంగ్‌ వచ్చినప్పుడు జేడీఎస్‌ నేత కుమారస్వామికి సపోర్టు చేసిన 110 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తీసుకువచ్చి హోటల్‌లో దాచినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. 

మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక మాట అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటున్న చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎణ్ని వేషాలు వేశారో మరచిపోయారా అంటూ కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios