Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పేరు కాదు.. దమ్ముంటే జిన్నా టవర్ పేరు మార్చండి : జగన్‌కు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సవాల్

జగన్‌కు దమ్ముంటే జిన్నా టవర్ పేరు మార్చాలని సవాల్ విసిరారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. వేల మంది ఊచకోతకు కారణమైన వ్యక్తి జిన్నా అని ఆయన మండిపడ్డారు. 
 

ap bjp leader vishnuvardhan reddy slams cm ys jagan over name change of ntr health university
Author
First Published Sep 21, 2022, 8:58 PM IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో అధికార - ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చిన వారు.. గుంటూరులోని జిన్నా టవర్ పేరు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. జిన్నా టవర్ గురించి బీజేపీ స్పందించిన తర్వాత భయంతో రంగులు వేశారని.. పాకిస్తాన్ రంగు తీసేసి జాతీయ జెండా రంగు వేశారని, కానీ పేరు మాత్రం మార్చలేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వేల మంది ఊచకోతకు కారణమైన వ్యక్తి జిన్నా అని.. గుంటూరులో తప్పించి భారతదేశంలో ఎక్కడా జిన్నా టవర్లు, జిన్నా సెంటర్లు లేవని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. చేతనైతే జిన్నా వంటి దేశద్రోహుల పేర్లు మార్చాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసలు వైసీపీ ప్రభుత్వం దేశభక్తులకు అనుకూలమా.. లేక దేశద్రోహులకు అనుకూలమా అన్నది తేల్చుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

అంతకుముందు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా జగన్ సర్కార్ నిర్ణయాన్ని ఖండించారు. రాజకీయ దురుద్దేశాలతోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌ను అభిమానించే వ్యక్తులు రాష్ట్రవ్యాప్తంగా వున్నారని సోము వీర్రాజు తెలిపారు. ఇలాంటి నిర్ణయాలతో ఏం సాధిస్తారంటూ జగన్‌ను ఆయన ప్రశ్నించారు. వ్యక్తుల పేర్లను మార్చగలరు కానీ చరిత్రను కాదని సోము వీర్రాజు చురకలు వేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని ఆయన గుర్తుచేశారు. 

ALso REad:పేర్లను మార్చగలరు కానీ చరిత్రను కాదు.. దురుద్దేశంతోనే ఇలా: జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ప్రవేశ పెట్టారు.  వైద్యరంగంలో సంస్కరణలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టినందునే ఆయన పేరును ఈ హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని తాము భావించినట్టుగా మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వమే గొప్పగా గౌరవించిందన్నారు. ఎన్టీఆర్ ను కించపర్చేలా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మంత్రి రజనీ ఈ సందర్భంగా చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios