Asianet News TeluguAsianet News Telugu

కోర్టు తీర్పుకు భయపడే బిల్లు వెనక్కి, రోడ్లపై గుంతలు పూడ్చలేరు.. వికేంద్రీకరణ చేస్తారా: సోము వీర్రాజు

వికేంద్రీకరణ (ap three capitals) అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే బిల్లు వెనక్కి తీసుకున్నారంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డులో గోతులు పూడ్చలేని వారు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. 

ap bjp chief somu veerraju responds on cm jagan statement on three capitals bill in assembly
Author
Amaravati, First Published Nov 22, 2021, 5:57 PM IST

వికేంద్రీకరణ (ap three capitals) అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే బిల్లు వెనక్కి తీసుకున్నారంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార వికేంద్రీకరణ వారి సొత్తు కాదని ఆయన అన్నారు. వికేంద్రీకరణ బీజేపీ కూడా చేసిందని, కొత్త రాష్ట్రాలు తీసుకువచ్చిందని సోము వీర్రాజు గుర్తుచేశారు. ఒక పద్ధతి ప్రకారం బీజేపీ వికేంద్రీకరణ చేపట్టిందని.. కానీ, రోడ్డులో గోతులు పూడ్చలేని వారు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. 

అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే రాజధాని అని సీఎం జగన్ (ys jagan mohan reddy) గతంలో చెప్పిన మాటకు సమాధానం చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. చెప్పిన మాటకు జగన్ కట్టుబడి ఉండాలని సోము వీర్రాజు సూచించారు. అధికార వికేంద్రీకరణపై మాట్లాడే హక్కు జగన్ కు లేదని .. విశాఖను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. రాజధానులపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్ని పార్టీలతో చర్చించాలని, ప్రజాభిప్రాయం సేకరించాలని సోము వీర్రాజు కోరారు. 

ALso read:Three Capitals Bill: మూడు రాజధానులపై జగన్ ఎందుకు వెనక్కి తగ్గారు?.. మరో బిల్లు ఇప్పట్లో లేనట్టేనా?

అంతకుముందు నెల్లూరు జిల్లాలో సాగుతున్న అమరావతి farmers మహా పాదయాత్రలో bjp నేతలు పాల్గొంటారు. గన్నవరం ఎయిర్‌పోర్టునుండి నెల్లూరు వరకు ఎంపీ సుజనా చౌదరి నేతృత్వంలో ర్యాలీ సాగింది. నెల్లూరు జిల్లా కావలి నుండి బీజేపీ ఎంపీ సీఎం రమేష్  రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకొంది.  ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదివారం నాడు ప్రకటించింది.

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి  బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని 90 శాతం హమీలను బీజేపీ నెరవేర్చిన విషయాన్ని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. Amaravati లోనే రాజధాని ఉండాలనేది తమ పార్టీ అభిప్రాయమని Somu Veerraju ఈ సందర్భంగా గుర్తుచేశారు. గతంలోనే ఈ విషయమై తమ పార్టీ  తీర్మానం చేసిందన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో తాము పాల్గొని మద్దతిస్తామని వీర్రాజు చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios