ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు .. సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఈ సందర్భంగా చిరు అభినందనలు తెలియజేశారు. అనంతరం శాలువాతో వీర్రాజును సత్కరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చిరు సూచించారు. 

 

 

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన వెంటనే సోము వీర్రాజు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వివిధ అంశాలపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన విధానాలను తెలియజేస్తూ అయోమయం లేకుండా చూసే కార్యక్రమాన్ని ఆయన తొలుత చేపట్టినట్లు కనిపిస్తున్నారు. ఆయన వచ్చేంత వరకు రాజధాని విషయంలో పార్టీ శ్రేణుల్లో కేంద్ర వైఖరిపై, రాష్ట్ర పార్టీ వైఖరిపై గందరగోళం కొనసాగుతూ వచ్చింది. 

Also Read:పక్కా వ్యూహంతో సోము వీర్రాజు దూకుడు: జీవీఎల్ ఔట్, రామ్ మాధవ్ ఇన్

మరోవైపు ఆయనను ఆయనను అధ్యక్ష పదవిలో కూర్చో బెట్టడం, పవన్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపు సామాజికవర్గానికి బీజేపీ గాలం వేస్తుందనేది తథ్యం. కాపులను తమవైపుగా తిప్పుకోవాలనేది ఎప్పటినుండో బీజేపీ ప్లాన్.

 

 

గతంలో కన్నాను ఈ పదవిలో కొర్చోబెట్టింది కూడా అందుకే. ఏది ఏమైనా కాపు రాజకీయాన్ని మాత్రం బీజేపీ ఇకమీదట జనసేనతో కలిసి బలంగా చేయబోతుందనేది అక్షర సత్యం. అందుకోసమే పవన్‌తో మరింత సన్నిహితంగా మెలిగేందుకు వీర్రాజు... చిరంజీవిని కలిశారనే టాక్ వినిపిస్తోంది.