రేపు చలో అమలాపురానికి బయల్దేరిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును విజయవాడలో పోలీసులు నిర్బంధించారు.  ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున ముందస్తు నిర్బంధం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంతర్వేది పర్యటనకు బయల్దేరడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై వీర్రాజు మండిపడ్డారు.

దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన యువకులపై కేసులు పెట్టడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆగడాలను నిరసిస్తూ రేపు ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని చెప్పారు.