జగన్ తీరు 2014లో తనకు అధికారం ఇవ్వలేదనే కోపంతోనే ప్రజలను వేధిస్తున్నట్లుగా ఉందన్నారు. ప్రజల మీద భారం వేసి నవరత్నాలను ముష్టి వేసినట్లుగా జగన్ దోపిడి కార్యక్రమాలకు తెరదీశారని లక్ష్మీనారాయణ విమర్శించారు.

నవరత్నాల పేరిట ప్రజల వద్ద నుంచి తొమ్మిది నెలల నుంచి ట్యాక్సులు వసూలు చేస్తున్నారని.. డీజిల్, కరెంట్, లిక్కర్, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారని కన్నా ఆరోపించారు.

Aslo Read:గడప వద్దకే పెన్షన్లు: జగన్ సర్కార్ రికార్డు, ఇప్పటికే 80 శాతం మందికి పూర్తి

పోలీసుల సాయంతోనే ముఖ్యమంత్రి జగన్ పరిపాలనా సాగిస్తున్నారని ఆరోపించారు కన్నా లక్ష్మీనారాయణ. రాజధాని తరలింపును నిరసిస్తూ గత 75 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న నిరసనకు ఆయన ఆదివారం సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ... దురుద్దేశ్యంతోనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారని విమర్శించారు. పాదయాత్రలో ఎన్నో మాటలు చెప్పారని.. కానీ చేసింది మాత్రం శూన్యమని కన్నా ఆరోపించారు.

తెలుగుదేశం పాలన కంటే వైసీపీ పాలన అరాచకంగా ఉందని, ప్రజా సమస్యలపై గొంతెత్తితేనే కేసులు పెట్టి వేధిస్తున్నారని లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు.  ఇసుక మాఫీయా పేరు చెప్పి ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు ఉద్యమాలు చేశారని కానీ అంతకన్నా ఎక్కువగా ఇసుక మాఫియా రాష్ట్రంలో ఇసుక రేట్లు పెంచేసిందని కన్నా ఆరోపించారు.

Also Read:మరోసారి పేదల పక్షపాతి అని నిరూపించుకున్న జగన్

పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్, ఇసుక, ఇటుక రేట్లు భారీగా పెరిగాయని.. ఇక ఇల్లు ఎక్కడి నుంచి వస్తుందని ఆయని నిలదీశారు. 2022 నాటికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని భావించిన ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి 12 లక్షల ఇల్లు కేటాయించారని కన్నా గుర్తుచేశారు.

వీటికి సైతం రాజకీయం, అవినీతి అడ్డు పెట్టి పేదల ఇల్లు పాడుపడేలా చేశారని దుయ్యబట్టారు. పేదవాడికి పార్టీలు అంటకట్టి సంక్షేమ పథకాలు అందకుండా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.