ఏపీ బంద్: అచ్చెన్నాయుడి గృహనిర్బంధం, టీడీపీ శ్రేణుల అరెస్ట్
తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులకు నిరసనగా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏపీ బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేస్తున్నారు.
అమరావతి: తమ పార్టీ కార్యాలయాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) కార్యకర్తల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బుధవారం బంద్ నిర్వహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు బుధవారం ఉదయం నుంచే రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలకు దిగారు. దీంతో టీడీపీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. టీడీపీ ఎపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
వీడియో
AP Bandh నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ చదలవాడ అరవిందబాబును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర బంధ్ లో భాగంగా నరసరావుపేటలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండుకు ర్యాలీగా బయలుదేరారు. వారిని ఓవర్ బ్రిడ్జీపై పోలీసులు అడ్డుకుని చదలవాడ అరవిందబాబును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
గుంటూరు బస్టాండ్ వద్ద బంద్ నిర్వహిస్తున్న గుంటూరు తూర్పు టిడిపి ఇంచార్జి మొహమ్మద్ నసీర్, గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ, యల్లువల అశోక్ ,ప్రధాన కార్యదర్శి షేక్ నాగులమీర బాపట్ల తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కొల్లూరు నాగ శ్రీధర్ ను టిడిపి తెలుగుయువత నాయకులను అరెస్ట్ నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు.
Also Read: జగన్ పై టీడీపీ బూతు వ్యాఖ్యలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : సజ్జల రామకృష్ణా రెడ్డి
TDP Bandhకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని నూజివీడు పట్టణంలో డిఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు నూజివీడు సబ్ డివిజన్లు 26 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కొంత మంది టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే వారిపై చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అసభ్య పదజాలంతో దూషించడంపై ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై మంగళవారం దాడులు చేశారు అలాగే, పట్టాభి ఇంటిపై కూడా దాడులు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఎంపీ బంద్ కు పిలుపునిచ్చారు. Chandrababu పిలుపు మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్నారు.
టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం ఉదయం నుంచే నిరసన కార్యక్రమాలకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.