అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల కోర్టుల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై వున్న విశ్వాసం సన్నగిల్లేలా వున్నాయని... ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ హైకోర్టుకు పిటిషన్ రూపంలో ఫిర్యాదు అందింది. బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు స్పీకర్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవల స్పీకర్ తమ్మినేని సీతారాం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... న్యాయస్థానాలే ప్రభుత్వాన్ని నడిపిస్తాయా? అని ప్రశ్నించారు. కోర్టులు పరిపాలనలో అదికంగా జోక్యం చేసుకొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. 

read more  అలాంటి వారిని చూసిన దేశంలో ఇలాంటి స్పీకరా..: తమ్మినేనిపై ఎమ్మెల్సీల ఆగ్రహం

ఏపీలో రాజకీయ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుకొన్నాయని... కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకొంటే ఈ మాత్రానికి ప్రభుత్వమెందుకు ఆయన ప్రశ్నించారు. ప్రజా కోర్టులో ఎన్నికలు నిర్వహించుకోవడం ఎందుకని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు ఎందుకు అని ఆయన అడిగారు. 50 ఏళ్లుగా చూడని వింత పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తమ్మినేని అభిప్రాయపడ్డారు. 

ఇక ప్రతిపక్ష టిడిపి నాయకులు మండలిలో ద్రవ్య బిల్లును ఆపి ఉద్యోగుల జీతాలను అడ్డుకొన్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా కోర్టులను ఉద్దేశించి స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.