ఆంధ్రప్రదేశ్‌ శాసససభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశఆరు. తాను గౌతమ బుద్దుడిని కాదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసససభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశఆరు. తాను గౌతమ బుద్దుడిని కాదని అన్నారు. టీడీపీ సభ్యుల తీరును సీరియస్‌గా తీసుకున్న స్పీకర్ తమ్మినేని.. పోడియం దగ్గరకు ఆటోమెటిక్ సస్పెన్షన్ చేయనున్నట్టుగా రూలింగ్ ఇచ్చారు. సభను సజావుగా నడిపించడమే తన కర్తవ్యం అని అన్నారు. టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేందుకు ప్రయత్నించారని అన్నారు. కాగితాలు చింపి తనపై వేసేందుకు ప్రయత్నించినా పూలు చల్లుతున్నారనే భావించానని చెప్పారు. టీడీపీ సభ్యులు నిరసన తెలియచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ సభ్యుల ప్రవర్తన ఆక్షేపణీయంగా ఉందని అన్నారు. 

తనకు సభ్యులందరూ సమానమేనని చెప్పారు. తనపై సీనియర్ సభ్యులు కూడా దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఎలీజాపై టీడీపీ సభ్యులు తోసేశారు. సభలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. తానేమి గౌతమ బుద్ధుడిని కాదని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు మారాలని అన్నారు. 

‘‘టీడీపీ సభ్యులు ఈరోజు సభలో ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. సభను అగౌరవపరిచారు. సభకు గౌరవం లేదు. సభాపతి స్థానానికి గౌరవం లేదు. స్పీకర్ స్థానం ముఖ్యమైనది. ఎంతో మంది గొప్ప వ్యక్తులు స్పీకర్‌గా చేశారు. ఎందరో గొప్పవాళ్లు ఈ స్థానంలో ఉండి శాసనసభ గౌరవాన్ని ఇనుమడింప చేశారు. అందుకే వాళ్లంతా ఆదర్శప్రాయులు. స్పీకర్‌గా ఎవరూ ఉన్న స్థానాన్ని గౌరవించాలి’’ అని స్పీకర్ పేర్కొన్నారు. 

అయితే ఈ రోజు సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరగా.. తనుక సంతకాలు చేసి పంపించాలని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేస్తానని స్పీకర్ తమ్మినేని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌ను స్పీకర్ తమ్మినేని శ్రీరామునితో పోల్చారు.‘‘శ్రీరామచంద్రుడు మంచివాడే కదా.. రావణసురున్ని ఆయనే సంహరించాడు. మనం తొందరపడకూడదు. మన నాయకుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు. రావణసురులను ఎలా చంపాలనేది ఆయన చూసుకుంటారు’’ అని కూడా స్పీకర్ తమ్మినేని శాసనసభలో కామెంట్ చేశారు. 


ఇక, ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. జీవో నెంబర్ 1 రద్దు చేయాలని టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ మేరకు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సిద్దమవ్వగా టీడీపీ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల వైఖరిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌కు గౌరవం ఇవ్వాలని టీడీపీ సభ్యులకు సూచించారు. అయితే తమ హక్కులను కాపాడాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకని స్పీకర్‌పై పేపర్లను చించివేశారు.

అయితే టీడీపీ సభ్యులపై అధికార పక్షం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభ సజావుగా జరగాలంటే.. వారిని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ పక్షంలోనే ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య దూసుకెళ్లగా.. మంత్రి అంటి రాంబాబు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది.