Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు కరోనా పాజిటివ్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిద్దరు ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం తమ్మినేని ఆస్పత్రిలో చేరారు.

AP Assembly speaker Tammineni Seetharam couple tested Corona positive
Author
Srikakulam, First Published May 4, 2021, 8:06 AM IST

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ వారం రోజుల క్రితం శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చేరారు. 

నాలుగు రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని కరోనా లక్షణాలతో అదే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వస్తు్నాయి. వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.

ఇదిలావుంటే, సోమవారం సాయంత్రం వెలువడిన బులిటెన్ ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 11 లక్షల 63వేల 994 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో 71 మంది మరణించారు. 
తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9మంది చొప్పున మరణించారు.అనంతపురం,కర్నూల్ జిల్లాల్లో ఏడుగురు చొప్పున చనిపోయారు.ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరులో ఐదురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 8207కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,67,18,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 35,732 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ఇప్పటివరకు10లక్షల 03 వేల 935 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1,51,852 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.గత 24 గంటల్లో అనంతపురంలో 1158, చిత్తూరులో 1714,తూర్పుగోదావరిలో1914,గుంటూరులో 1194, కడపలో 969,కృష్ణాలో 990, కర్నూల్ లో 2628, నెల్లూరులో 1337,ప్రకాశంలో 1236, శ్రీకాకుళంలో 1732, విశాఖపట్టణంలో 1960, విజయనగరంలో 1052,పశ్చిమగోదావరిలో 1088కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -86,875 మరణాలు 682
చిత్తూరు  -1,26,811మరణాలు 994
తూర్పుగోదావరి -1,49,206, మరణాలు 718
గుంటూరు  -1,10,247, మరణాలు 736
కడప  -66023, మరణాలు 494
కృష్ణా  -64,127,మరణాలు 785
కర్నూల్  -83,066, మరణాలు 564
నెల్లూరు -84,626,మరణాలు 624
ప్రకాశం -75,112,మరణాలు 646
శ్రీకాకుళం -74,575మరణాలు 409
విశాఖపట్టణం  -85,024,మరణాలు 663
విజయనగరం  -52,47 మరణాలు 308

Follow Us:
Download App:
  • android
  • ios