ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్‌‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు.

10న ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.