Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడు, నిమ్మలకు నోటీసులు: 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం బుధవారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రాంగంణంలో జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదుల మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు నోటీసులు జారీ చేయాలని  కమిటీ నిర్ణయం తీసుకొంది. 
 

AP Assembly privileges committee decides to issue notices to TDP MLA rama naidu and atchannaidu lns
Author
Guntur, First Published Dec 23, 2020, 12:13 PM IST

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం బుధవారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రాంగంణంలో జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదుల మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు నోటీసులు జారీ చేయాలని  కమిటీ నిర్ణయం తీసుకొంది. 

also read:నిమ్మల, అచ్చెన్నాయుడిపై ఫిర్యాదులు: రేపు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ

10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ కోరింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై టీడీపీ కూడ నోటీసులను ఈ సమావేశంలో ప్రస్తావించింది. అయితే ఈ విషయాలు ఎజెండాలో లేవని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.స్పీకర్ తమ్మినేని సీతారాం  ద్వారా అందిన ప్రివిలేజ్ మోషన్లపై తాము ఈ సమావేశంలో చర్చించామన్నారు. 

 

టీడీపీ సభ్యులు మంత్రి కన్నబాబుపై, చీఫ్ మార్షల్స్ పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్టుగా ఈ కమిటీలో సభ్యుడు అనగాని సత్యప్రసాద్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.  అసెంబ్లీలో ఆమోదించి ప్రివిలేజ్ కమిటీకి వచ్చిన నోటీసులు, స్పీకర్ ద్వారా వచ్చిన  నోటీసులపై చర్చించామన్నారు.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నోటీసులు అందిన 10 రోజుల తర్వాత వివరణ ఇవ్వాలని చైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. వచ్చే ఏడాది జనవరి 18 లేదా 19 తేదీల్లో ప్రివిలేజ్ కమిటీ సమావేశం తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.


 

 

Follow Us:
Download App:
  • android
  • ios