Asianet News TeluguAsianet News Telugu

కొన్ని ఐపీ అడ్రస్‌లు గూగుల్ కూడా గుర్తించలేదు:పెగాసెస్‌పై అసెంబ్లీకి హౌస్ కమిటీ నివేదిక

పెగాసెస్ పై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ అసెంబ్లీకి సమర్పించిన మధ్యంతర నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు. కొన్ని ఐపీ అడ్రస్ లను గూగుల్ కూడా గుర్తించలేదని కూడా ఈ నివేదిక తెలిపింది. 
 

Ap Assembly House Committee found key information on  Pegasus
Author
First Published Sep 20, 2022, 4:53 PM IST

అమరావతి: చంద్రబాబు సర్కార్ హయంలో  స్టేట్ డేటా సెంటర్ నుండి  డేటా చోరీ జరిగిందని  ఏపీ శాసనసభ సంఘం తేల్చింది. 85 పేజీలతో నివేదికను ఇవాళ శాసనసభకు హౌస్ కమిటీ  చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి అసెంబ్లీకి నివేదికను సమర్పించారు.  ఈ నివేదికలో  పలు కీలక అంశాలను కమిటీ పేర్కొంది.  త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను అందిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. 

స్టేట్ డేటా సెంటర్  నుండి గుర్తు తెలియని సర్వర్లకు  వెళ్లిన ఐపీ వివరాల కోసం ఏపీ హౌస్ కమిటీ  గూగుల్ కు లేఖ రాసింది. అయితే ఈ ఐపీ అడ్రస్ లను గుర్తించలేమని కూడ గూగుల్ సంస్థ హౌస్ కమిటీకి  తెలిపింది.  ఏయే సర్వర్ల నుండి డేటా చౌర్యం జరిగిందనే విషయమై  హౌస్ కమిటీ ఈ నివేదికలో వివరాలను పొందుపర్చింది. 

2018 నవంబర్  నుండి 2019 మార్చి 31 వరకు డేటా చౌర్యం జరిగిందని  హౌస్ కమిటీ తేల్చి చెప్పింది. స్టేట్ డేటా సెంటర్ లాగ్స్ ను  కూడ హౌస్ కమిటీ పరిశీలించింది. ప్రజా సాధికారిక సర్వే, స్టేట్ డేటా సెంటర్ కు చెందిన 264 సర్వర్లలో 18 సర్వర్ల ద్వారా డేటా లీకైందని హౌస్ కమిటీ గుర్తించింది. ఈ 18 సర్వర్ల నుండి 24.3 టెరా బైట్స్ డేటా  బదిలీ అయిందని హౌస్ కమిటీ తన నివేదికలో వివరించింది. 

also read:కొన్ని ఐపీ అడ్రస్‌లు గూగుల్ కూడా గుర్తించలేదు:పెగాసెస్‌పై అసెంబ్లీకి హౌస్ కమిటీ నివేదిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెగాసెస్ సాప్ట్ వేర్ ను కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యానించారని ఈ ఏడాది మార్చిలో మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి.ఈ విషయమై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. డేటా చౌర్యం జరిగిందని పలువురు వైసీపీ సభ్యుఅు అనుమానం వ్యక్తం చేశారు.  ఈ  విషయమై సభాసంఘం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఈ ఏడాది మార్చి 25న హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ హౌస్ కమిటీకి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మెన్ గా కొనసాగుతున్నారు.  ఇప్పటికే పలు శాఖల అధికారులతో హౌస్ కమిటీ  సమావేశమై కీలక అంశాలను సేకరించింది. ఇవాళ అసెంబ్లీకి మధ్యంతర నివేదికను హౌస్ కమిటీ అందించింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios