అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. సభను సజావుగా సాగకుండా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ చంద్రబాబును అడ్డుకోకపోయినా అడ్డుకున్నట్లు తమను నెట్టేసినట్లు చంద్రబాబు అండ్ టీం ఆరోపించడాన్ని శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. 

గత ఐదేళ్లు సభ సంప్రదాయాలను ఏ విధంగా మంటగలిపారో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించుకుంటే వారికే సమాధానం వస్తుందన్నారు. నాడు తమ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజాలను ఎలా ఇబ్బందులకు గురి చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజాలపై ఏకంగా భౌతిక దాడులకు దిగిన విషయం అందరికీ తెలుసునన్నారు. 

మీడియా ఛానల్స్‌ ను అసెంబ్లీలోకి రానీయట్లేదు అని, సభా సంప్రదాయలకు సంబంధించి అంశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని తెలుగుదేశం పార్టీ సభ్యులకు కూడా తెలుసునన్నారు.  

అయితే అనవసరంగా రాద్ధాంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు మీడియాపై ఆంక్షలకు సంబంధించి ఒక జీవో గురించి చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. 

ఆయన చనిపోవడంతో చంద్రబాబులో మార్పు, బతికి ఉంటేనా...: గుట్టువిప్పిన మంత్రి అవంతి...

మీడియా వ్యవస్థను సర్వనాశనం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులేనని చెప్పుకొచ్చారు. మీడియాపై ఆంక్షలు విధించామన్నది కేవలం అపోహలు మాత్రమే అన్నారు. 

వాస్తవాలు ప్రచురించిన దగ్గర ఎక్కడా కూడా ప్రశ్న అనేది ఉండదన్నారు. అసత్యాలు ప్రచురిస్తే చర్యలు తీసుకోవద్దా అంటూ నిలదీశారు శ్రీకాంత్ రెడ్డి. మాకు అలవాటు మేం అసత్యాలు ప్రచురించడం, అవి లేకపోతే మేం ఎలా మనుగడ సాగిస్తాం, మేం అవే కొనసాగిస్తాం, అవి లేకపోతే మా ఎల్లో మీడియా ఎట్లుంటుంది అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.  

బూటు కాళ్లతో తన్నారు, ఐదేళ్లు బతుకుతానో చస్తానో కూడా ...: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి.

వాస్తవాలు రాస్తాం అన్న మాట మాత్రం టీడీపీ ఎమ్మెల్యేల నోట రావడం లేదని ఆ సంస్థల నోటివెంట రావడం లేదని చెప్పుకొచ్చారు. గతంలో సాక్షిపేపర్‌ పైన 5 కేసులుకేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.  

రాజధానిలో భూముల ధరలు తగ్గుతున్నాయని వార్త రాస్తే అది ఏదో మానసిక వేదనకు గురయ్యారని చెప్పి కేసులు పెట్టింది వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో ఏరకంగా పోలీసులను వాడుకుని పత్రికా హక్కులకు భంగం కలిగించారో అన్నది అందరికీ తెలుసునన్నారు. 

సాక్షి పత్రికపై అధికారులు భాస్కర్‌ కాటమనేని, చెరుకూరి శ్రీధర్, చంద్రబాబులు ఐదు జీవోలు విడుద చేసిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. సాక్షిని ఎలాగైనా బ్యాన్‌ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారని మండిపడ్డారు.  

నీకు మానవత్వం లేదు, దేవుడు చూసుకుంటాడులే: చంద్రబాబుపై జగన్ ధ్వజం...

చంద్రబాబు హయాంలో సాక్షి రిపోర్టర్లను లోపలికి రాకుండా గేటు దగ్గర నుంచే వెనుకకు పంపేయండి అని ఆదేశాలు ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏ వార్త వేసినా, ప్రచురించినా వారిపై చర్యలకు ఉపక్రమించలేదా అని నిలదీశారు. 

చంద్రబాబు అడుగు ముందు వేసి చంద్రబాబు వృధాఖర్చులు చేస్తున్నారంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనం రాస్తే నేషనల్‌ మీడియా అమ్ముడుపోయిందంటూ వ్యాఖ్యలు చేయలేదా అని నిలదీశారు. 

నన్ను ఎంతలా ఏడిపించావ్: మగధీర సినిమా డైలాగ్ చెప్తూ చంద్రబాబుపై రోజా పంచ్ లు...

చంద్రబాబును పొగుడుతూ ఆయన ఏమీ చేయకపోయినా ఆయనను ఇంద్రుడు, చంద్రుడూ అని రాస్తే సరే లేకపోతే ఆరోపణలు చేయడం అలవాటుగా చేసుకున్నారంటూ విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ కూడా కట్టలేకపోయాడని అలాంటి వ్యక్తి ఐదు సంవత్సరాలలో పెద్ద నగరాన్ని నిర్మిస్తానని చెప్పడం విడ్డూరం కాకపోతే ఇంకేంటని నిలదీశారు. ఆ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ను కూడా తామే పూర్తి చేయబోతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఎన్టీఆర్ ని నడిరోడ్డుపై కూర్చోబెట్టిన వైఎస్: అసలు విషయం చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం...