ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా వైరస్ బారినపడ్డారు. 

AP Assembly Deputy Speaker Tests Positive For Coronavirus

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. సామాన్యుడు సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అందరికీ సోకుతుంది.  తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా వైరస్ బారినపడ్డారు. 

ఎవరు చింతించవద్దు తన ఆరోగ్యం నిలకడగా ఉందని నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులు హోమ్ క్వారన్టైన్  లో ఉండటం జరుగుతుందని, తన పుట్టిన రోజు వేడుకలు ఇతరాత్రా కార్యక్రమాలు వాయిదా వేయాలని, తాము సైతం వాయిదా వేశామని, నియోజకవర్గ ప్రజలు ఇది గమనించాలని కోరారు. 

ఇకపోతే.... ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 8,555 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య లక్షా 58 వేల 764కి చేరాయి. 

ఇవాళ ఒక్కరోజే కరోనాతో 67 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,474కి చేరాయి. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 74,404 కాగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 82,886కి చేరింది. Also Read:కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా ఇప్పటి వరకు 20,65,407 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

గడిచిన 24 గంటల్లో 6,272 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 24 గంటల్లో 52,834 మంది శాంపిల్స్ పరీక్షించారు. ఇక ఆదివారం విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,227 కేసులు నమోదయ్యాయి. 

ఆ తర్వాత వరుసగా అనంతపురం 696, చిత్తూరు 781, తూర్పు గోదావరి 930, గుంటూరు 639, కడప 396, కృష్ణా 379, కర్నూలు 996, నెల్లూరు 448, ప్రకాశం 384, శ్రీకాకుళం 492, విజయనగరం 637, పశ్చిమ గోదావరిలలో 550 మందికి పాజిటివ్‌గా తేలింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios