చంద్రబాబు అండ్ టీంపై చర్యలు తీసుకోండి: మంత్రి బుగ్గన తీర్మానం

గతంలో పదేపదే అధికారపక్షం గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు నాయుడు అంటే ఆనాటి మంత్రి కొణిజేటి రోశయ్య కూడా సెటైర్లు వేశారని గుర్తు చేశారు. అందరి గుండెల్లో నిద్రపోతానంటున్న చంద్రబాబు  ఇంటిదగ్గర నిద్రపోవడం లేదేమోనంటూ సెటైర్లు వేసిన అంశాన్ని గుర్తు చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 

AP Assembly: AP finance minister Buggana rajendranath reddy resolution passed in assembly

అమరావతి: అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్ తో తెలుగుదేశం పార్టీ సభ్యుల వాగ్వాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మార్షల్స్ తో వాగ్వాదానికి దిగడంతోపాటు, బూతులు తిట్టడం, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సభ తీర్మానించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. 

గురువారం చోటు చేసుకున్న ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ ఆ తీర్మానాన్ని స్పీకర్  తమ్మినేని సీతారాంకు అప్పగించారు బుగ్గన. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటన గురించి వాస్తవాలు అనేవి వీడియోలో స్పష్టంగా తెలుస్తున్నా ఇప్పటికీ చంద్రబాబులో గానీ, టీడీపీ సభ్యుల్లోగానీ ప్రశ్చాత్తాపం లేకపోవడం దురదృష్టకరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకర్యాలీగా టీడీపీ సభ్యులు వస్తే ఆహ్వానం పలకాలా అంటూ నిలదీశారు. 

మార్షల్స్‌ను చంద్రబాబు బాస్టర్డ్ అంటారా: జగన్...

అసెంబ్లీ గేటును కారాగారం అంటూ మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు కట్టించిన గేట్లే జైలును తలపిస్తున్నాయని అవి చంద్రబాబు డిజైన్ అంటూ సెటైర్లు వేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నిబంధనలను చంద్రబాబు అండ్ కో ఉల్లంఘించారంటూ ఆరోపించారు. 

ఇంత గొడవ జరిగినప్పటికీ ఇప్పటికి కూడా టీడీపీ నేతలు ప్లకార్డులు తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఇప్పటికీ ప్లకార్డులు చూపిస్తున్న విషయం తెలుసుకోవాలన్నారు. సభలో సమయం తక్కువ ఇస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించడం సరికాదన్నారు. 

సభలో సభ్యులన బట్టే సమయం కేటాయింపు ఉంటుందని ఆ విషయం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తెలుసుకోవాలని సూచించారు. పౌరుషంగా తాను మాట్లాడలేదని చంద్రబాబు చెప్పుకుంటున్నారని గత అసెంబ్లీలో చూస్తే తెలుస్తుందన్నారు. 

బాత్ రూమ్ దగ్గర దాక్కునేవాళ్లం,.. వాళ్ళ అంతలా వేధించారు: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన...

అసెంబ్లీలో తాను చండశాసనుడునని, తలచుకుంటే అది చేస్తా ఇది చేస్తా, అధికారపక్షం గుండెల్లో నిద్రపోతా అంటూ ఎన్నిసార్లు పౌరుషంగా మాట్లాడలేదో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. పాతేస్తా, తాటతీస్తా, గుండెల్లో నిద్రపోతా, అంతుచూస్తానని చంద్రబాబు ఎన్నిసార్లు అనలేదని అది పౌరుషం కాదా అని నిలదీశారు. 

గతంలో పదేపదే అధికారపక్షం గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు నాయుడు అంటే ఆనాటి మంత్రి కొణిజేటి రోశయ్య కూడా సెటైర్లు వేశారని గుర్తు చేశారు. అందరి గుండెల్లో నిద్రపోతానంటున్న చంద్రబాబు  ఇంటిదగ్గర నిద్రపోవడం లేదేమోనంటూ సెటైర్లు వేసిన అంశాన్ని గుర్తు చేశారు. 

అనంతరం గురువారం అసెంబ్లీ గేటు వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతరులపై చర్యలు తీసుకోవాలని అలాగే సిబ్బంది భద్రతను కాపాడుతూ సభ సంప్రదాయాలను కాపాడాలని సభ కోరుతూ తీర్మానం చేస్తుందంటూ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు అప్పగించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 

సీఎం స్థానాన్ని అవమానించింది జగనే: కొడాలి నాని, రోజాలపై చంద్రబాబు ఆగ్రహం..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios