వెల్లడించిన మంత్రి గంటా శ్రీనివాసరావు

ఈ నెల 29వ తేదీన పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. మే 11న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిపారు. 

 జూన్‌ 18న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించనున్నట్టు వివరించారు. టెట్‌ అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని మంత్రి ప్రకటించారు.పాఠశాలల అభివృద్ధికి రోటరీ క్లబ్‌తో ఎంవోయూకు విద్యాశాఖ సూత్రప్రాయ అంగీకారం కుదిరిందన్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు సుమారు 6లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరైనట్లు మంత్రి వివరించారు.