ప్రత్యేకహోదాపై టిడిపి చేస్తున్న పోరాటం ఢిల్లీలో ముగిసినట్లేనా ?

ప్రత్యేకహోదాపై టిడిపి చేస్తున్న పోరాటం ఢిల్లీలో ముగిసినట్లేనా ? చంద్రబాబునాయుడు తాజా నిర్ణయం చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. సోమవారం సిఎం అధ్యక్షతన జరిగిన వ్యూహ కమిటి సమావేశంలో ప్రత్యేకహోదా కోసం త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు.

టిడిపి ఎంపిలు చేసిన పోరాటం బాగుందన్నారు. హోదాపోరులో భాగంగా మేధావులు, వివిధ జిల్లాల సంఘాలతో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తారట.నియోజకవర్గాల వారీగా సైకిల్ యాత్రలు చేయనున్నట్లు తెలిపారు. హోదా పోరు జాతీయస్ధాయిలో అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు.

అంతా బాగానే ఉంది కానీ కార్యాచరణ ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో మాత్రం చెప్పలేదు.చంద్రబాబు వరస చూస్తుంటే ఎంపిలను ఢిల్లీ నుండి వచ్చేయమన్నట్లే కనబడుతోంది.అంటే ప్రత్యకహోదా కోసం ఢిల్లీలో టిడిపి పోరు ముగిసినట్లేనా ?