ఆగని ఆకృత్యాలు: దాచేపల్లిలో మరో అత్యాచారం

Another rape incident at Dachepalle in andhra
Highlights

ఆగని ఆకృత్యాలు: దాచేపల్లిలో మరో అత్యాచారం

గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఇటీవలి కాలంలో రెండు అత్యాచార ఘటనలు తీవ్ర దుమారం సృష్టించాయి. ఓ సమీప బంధువు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

రెండు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

దుర్గివనంలో నివాసం ఉంటున్న దళిత మహిళ తన పన్నెండేళ్ల కూతురికి ఇంటి ముందు కసువు ఊడ్చాలని శనివారం ఉదయం చెప్పింది. ఇంటి పక్కనే ఉన్న రామాంజి (28)ని చూస్తే భయమేస్తోందని బాలిక కన్నీరు పెట్టింది. భయమెందుకని తల్లి నిలదీయడంతో తనపై రెండు నెలల క్రితం రామాంజి లైంగికదాడికి పాల్పడిన విషయాన్ని చెప్పింది.
 
రామాంజి ఆటో డ్రైవర్. రెండు నెలల క్రితం ఓ రోజు ఆటో తీసుకొని రామాంజి దుర్గికి బయలుదేరాడు. తన కూతురిని దుర్గిలోని తమ చెల్లెలి దగ్గర దించి రావాలని బాలిక తల్లి కోరింది. బాలికతో బయలుదేరిన రామాంజి దుర్గిలోని మోడల్‌ స్కూల్‌ దగ్గర ఉన్న మొక్కజొన్న తోటలోకి ఆ బాలికను బలవంతంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 

ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే గొంతుకొసి చంపేస్తానని బెదిరించాడు. దీనిపై బాధితురాలి తల్లి దుర్గి పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేసింది. 

loader