Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో మరో నాలుగురోజులు వర్షాలు... అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న నాలుగురోజుల వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు. 

another four days rains in andhra pradesh.... amaravati weather center akp
Author
Amaravati, First Published Jul 26, 2021, 2:59 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మరో నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని...దీని ప్రభావంతో జూలై 28 అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై అంత ఎక్కువగా వుండకపోవచ్చని స్టెల్లా వెల్లడించారు. 

ఏపీలో ప్రస్తుతం పశ్చిమ, నైరుతి గాలులు విస్తున్నాయని తెలిపారు. సోమవారం ఉత్తర కోస్తాంధ్రలోని కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా కొన్నిచోట్ల జల్లులు కురుస్తాయని వెల్లడించారు. 

వీడియో

ఇక జూలై 27, 28 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్లు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందన్నారు. అలాగే 29,30 తేదీలలో ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios