అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఆలయ ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం కొండపై భక్తులు తప్ప మరెవరూ ఉచిత భోజనం చేయరాదని ఆదేశించారు.

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై నిత్య అన్నదానంపై ఆలయ ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్నవరం కొండపై భక్తులకు మాత్రమే అన్నదానం చేయాలని చెప్పారు. అన్నవరం కొండపై భక్తులు తప్ప మరెవరూ ఉచిత భోజనం చేయరాదని ఆదేశించారు. 500 మంది వరకు దేవస్థాన సిబ్బంది, షాపుల నిర్వాహకులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఆలయంలో ఉచిత భోజనాలు చేస్తున్నారని అన్నారు. అయితే భక్తులు తప్ప మరెవరూ ఉచిత భోజనం చేయరాదని పేర్కొన్నారు.