Asianet News Telugu

అన్న పిలుపు: తటస్థుల ప్రశ్నలకు జగన్ జవాబులు ఇలా...

ఆంద్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 31, గురువారం రోజు  గ్రామ స్థాయిలో  తటస్థంగా ఉంటూ, ప్రభావం చూపే వ్యక్తులతో సమావేశమై,  "అన్న పిలుపు" పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

Anna pilupu: YS Jagan speakes with nutrals
Author
Hyderabad, First Published Jan 31, 2019, 8:41 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 31, గురువారం రోజు  గ్రామ స్థాయిలో  తటస్థంగా ఉంటూ, ప్రభావం చూపే వ్యక్తులతో సమావేశమై,  "అన్న పిలుపు" పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఇందులో భాగంగా మొదటి సమావేశం హైదరాబాద్ లో‌ జరిగింది. రానున్న రోజుల్లో 13 జిల్లాలో ఈ సమావేశాలు నిర్వహించినున్నారు.

 జనవరి నెలలో, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ప్రభావం చూపగల దాదాపు 60వేల మందికి పైగా వ్యక్తులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నుండి వ్యక్తిగతంగా ఉత్తరాలు పొందారు. సమాజంలో వారు భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ, రాష్ట్ర అభివృద్ధి లో వారి పాలు పంచుకుంటున్నందుకు వారిని ప్రశసించడం జరిగింది.  

ఈ ఉత్తరాల ద్వారా వారి వారి ప్రాంతాలు, రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని, తద్వారా, రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో ఎంతగానో ఉపయోగపడుతాయని జగన్ మోహన్ రెడ్డి  కోరారు. ఉత్తరాలు పొందిన వ్యక్తులు సూచనలు ఇవ్వడానికి, జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వారి ఆసక్తి ని తెలియజేయడానికి గాను offiiceofysjagan@gmail.com, +919199691996 ఫోన్ నంబరును ఉత్తరంలో పొందు పరిచారు. 

త్వరలో జిల్లాలలో జరిగే కార్యక్రమాలలో జగన్ సంబంధిత వ్యక్తులను కలవనున్నారు.

 గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా , ప్రకాశం, కర్నూలు, ఇతర జిల్లాలకు సంబంధించిన వారు ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఇందులో జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పై తన విజన్ ను కార్యక్రమం లో‌ పాల్గొన్న వారితో‌ చర్చించారు. ప్రాంతాల వారిగా సమస్యలు, వాటి పరిష్కారం పై అన్ని వర్గాల వారు ‌తమ ఆలోచనలను ‌పంచుకోవడం జరిగింది. 
సమావేశం ముగిసే ముందు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి,  వివిధ సమస్యలతో పాటు, వ్యక్తిగత జీవితానికి  సంబంధించిన పలు ప్రశ్నలను జగన్ మోహన్ రెడ్డి ముందుంచారు.

 వారితో సంభాషణ ఇలా సాగింది. 

యూపీఎస్సీ పరీక్షలకు సిద్దమవుతున్న వైజాగ్ కు చెందిన శ్రావణి: 014 లో‌ ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం రైల్వే జోన్ ను సాధించడానికి, కేంద్ర ప్రభుత్వం పై ఏ విధంగా పోరాటం చెయ్యాలి.

జగన్: మనం (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) 25 ఎంపీ సీట్లు గెలవడానికి ప్రయత్నించాలి. మన దగ్గర 25 మంది ఎంపీలు ఉంటే...కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఏ కూటమికి మన అవసరం ఉన్నా ‌.. రాష్ట్రం డిమాండ్ లను నెరవేర్చాల్సి ఉంటుంది.


సమావేశంలో పాల్గొన్న ప్రణయ్ అనే ఇంజనీర్, రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించడంతో పాటు, స్టార్ట్ అప్ కంపెనీల ద్వారా ఆదాయాలను పెంచుకోవడం పై జగన్ ప్రశ్నించారు.

జగన్: యువతకు స్వయం ఉపాధి ఎంతో ముఖ్యమైనది. స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలను ఎంతగానో పెంచుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యాపార అవకాశాలు ( ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పెంచడంతో పాటు, పరిశ్రమలలో 75% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టం తీసుకొస్తాం. రాష్ట్రంలో కియా మోటర్స్ కంపెనీ ఏర్పాటు చేసినా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగ అవకాశాలను మరోసారి పరిశీలించి, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తానని హామీ ఇస్తున్నాను.

సమావేశంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న కష్ట నష్టాలను ఏ విధంగా పరిష్కరిస్తారని,  జగన్ ను ప్రశ్నించారు.

జగన్: రైతు రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కనీసం వడ్డీలు కట్టడానికి కూడా సరిపోని విధంగా.. కేవలం రూ.4000 కోట్లు మాత్రమే విడుదల చేసారు. రాష్ట్రంలో ఉన్న  85 లక్షల రైతులకు వారి సమస్యల పరిష్కారానికి  ఉపయోగపడే విధంగా రూ. 12,500 ఇస్తామని‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మేము అమలుచేసే వాటినే హామీలుగా ‌ఇస్తున్నాము. అమలు చేయకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాము. ఇచ్చిన ప్రతీ హామీ ని నెరవేర్చి, తద్వారా ప్రతి కుటుంబం, వాళ్ల ఇంట్లో నాన్న గారి ఫొటో పక్కన  నా ఫొటో కూడా పెడుతుంది.

 

సమావేశం ముగిసిన తరువాత పాల్గొన్న వారందరూ జగన్ మోహన్ రెడ్డి తో సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ రూపుదిద్దిన "అన్న పిలుపు" కార్యక్రమం..గ్రామ స్థాయిలో ప్రభావం చూపగలిగే వ్యక్తులతో ఒక నెట్ వర్క్ ను ఏర్పాటు చేసి, వారంతా జగన్ మోహన్ రెడ్డి/ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించడానికి ఉపయోగపడనుంది. 

సెప్టెంబరు-డిసెంబరు మధ్య మూడు నెలల కాలంలో ప్రభావం చూడగలిగే వ్యక్తులను గుర్తించడం జరిగింది. "అన్న పిలుపు" కార్యక్రమం ద్వారా, గ్రామ స్థాయిలో ప్రభావం చూప గలిగే వ్యక్తులతో  జగన్ మోహన్ రెడ్డి దీర్ఘకాలికంగా వ్యక్తిగత సమాచార‌ వ్యవస్థ ను పెంపొందించుకోవడంతో పాటు, వివిధ నిర్ణయాలు తీసుకునేందుకు గాను, తరచుగా సూచనలు తీసుకోనున్నారు.


ప్రభావితం చూపగలిగే వ్యక్తులు అంటే, తమ పరిసర ప్రాంతాలలోని‌ వ్యక్తుల జీవితాలను వివిధ రూపాలలో ప్రభావితం చేసిన వ్యక్తులు. ఉపాధ్యాయులు,  వైద్యులు, సామాజిక కార్యకర్తలు, లాయర్లు, గ్రామ పెద్దలు ఇందులో ఉన్నారు. ఈ సమావేశాల ద్వారా వ్యక్తులు, వారి ఆలోచనలకు అనుగుణంగా జగన్ మోహన్ రెడ్డి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్ రేపటి భవిష్యత్తుకై, నిర్మాణాత్మకంగా  అడుగులు వేయడం జరుగుతుందని భావిస్తున్నారు.

"

Follow Us:
Download App:
  • android
  • ios